రాజమండ్రిలోని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద శుక్రవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ (లా&ఆర్డర్) ఏ. వి సుబ్బరాజు సిబ్బంది యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని, వారి వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని, జిల్లా పోలీస్ యంత్రాంగం యొక్క సంక్షేమమే ముఖ్య ధ్యేయంగా పనిచేస్తున్నామని తెలిపారు.