రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ టీ. కే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలో ప్రధానిగా రాహుల్ గాంధీని, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వై. ఎస్ షర్మిల రెడ్డిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. శనివారం రాజమండ్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రి పార్లమెంట్ కోఆర్డినేటర్ గా నియమించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు.