ఈనెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకానికి సంబంధించి తూర్పు గోదావరి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ వైఎస్ఎన్ మూర్తి సోమవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బస్సుల్లో మహిళలు సురక్షితంగా ప్రయాణించేందుకు ఫుట్ బోర్డు, హ్యాండిల్స్, సీట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బస్సుల కండీషన్ పై దృష్టి సారించామని, అదనపు డ్రైవర్లు, కండక్టర్లను కూడా నియమిస్తున్నట్లు ఆయన వివరించారు.