రాజమండ్రిలోని వీరబాద్రపురం మున్సిపల్ ఉన్నత పాఠశాలకు టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ రూ. 10 వేలు విలువ చేసే కుర్చీలను పాఠశాల ఉపాధ్యాయులకు శుక్రవారం అందజేశారు. జిఆర్ఎస్ ఫౌండేషన్ ద్వారా కుర్చీలు అందజేసినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు సంజయ్ రెడ్డి, పద్మశ్రీ, సూరిబాబు, మురళీకృష్ణ పాల్గొన్నారు.