రాజమండ్రి: 'అభివృద్ధికి పర్యాయపదం కూటమి ప్రభుత్వం'

కూటమి ప్రభుత్వం అభివృద్ధికి పర్యాయ పదంగా నిలుస్తుందని, ప్రస్తుతం నగరంలో ఎక్కడ చూసినా జరుగుతున్న అభివృద్ధి పనులే అందుకు నిదర్శనం అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. గురువారం రాజమండ్రిలోని కోరుకొండ రోడ్డులో రూ. 27 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంఖుస్థాపన చేశారు. నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నామని, త్వరలోనే సుందరమైన నగరాన్ని ప్రజలు చూస్తారని అన్నారు.

సంబంధిత పోస్ట్