రాజమండ్రి పార్లమెంటరీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అందిస్తున్న వైద్య సేవలు పార్టీకి బలాన్ని చేకూరుస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తోట రామకృష్ణ పేర్కొన్నారు. కొవ్వూరు నియోజకవర్గ నాయకులు మంగళవారం రాజమండ్రిలో డాక్టర్ శ్రీనివాస్ ను కలిసి ఆయన సేవలను ప్రశంసించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించి, పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసే వరకు కృషి చేస్తామని నాయకులు తెలిపారు.