రాజమండ్రి: విద్య సమాజంలో రుగ్మతలకు పారద్రోలే దివ్య ఔషధం

విద్య అనేది సమాజంలో చూసే రుగ్మతలకు పారద్రోలే దివ్య ఔషధం రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. గురువారం రాజమండ్రిలోని కోటిపల్లి బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ మీట్ సమావేశంకు ఎంపీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మంచి పౌరులుగా విద్యార్థుల్ని తీర్చి దిద్దే బాధ్యత తల్లితండ్రులు, ఉపాధ్యాయులు తీసుకోవలసి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్