రాజమండ్రిలోని అన్నపూర్ణమ్మపేట రైల్వే గేటు వద్ద నూతన సిసి రోడ్డు నిర్మాణానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేతుల మీదుగా శుక్రవారం శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 28 లక్షలతో వ్యయంతో ఈ సి సి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. నగరంలో మౌలిక వసతులు కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు.