తాను ఎలాంటి స్కామ్ చేయలేదని, దేశం విడిచి పారిపోనని, బెయిల్ ఇవ్వాలని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కోర్టును కోరారు. మూడు సార్లు ఎంపీగా పనిచేశానని, ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీనని పేర్కొన్నారు. కాగా లిక్కర్ స్కాం కేసులో మిథున్ రెడ్డి సహా 12 మంది రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 31 వరకు శుక్రవారం పొడిగించింది.