రాజమండ్రి: పార్క్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

రాజమండ్రిలోని 49వ డివిజన్ సింహాచల నగర్ లో సుమారు రూ. 42.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న పార్క్ అభివృద్ధి పనులకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మంగళవారం శంకుస్థాపన చేశారు. స్థానిక కాలనీ వాసులు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా పార్కును సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్