రాజమండ్రి: "అఖండ" వాయిదాతో డబ్బులు వెనక్కి

నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ' చిత్రం విడుదల వాయిదా పడటంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. శుక్రవారం విడుదల కావాల్సి ఉన్న ఈ చిత్రం కోసం రాజమండ్రిలో అభిమానులు కటౌట్లు, బ్యానర్లతో సంబరాలు చేసుకున్నారు. గురువారం ప్రీమియర్ షోల కోసం టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులు, వాయిదా ప్రకటనతో తమ డబ్బు తిరిగి పొందేందుకు థియేటర్ల వద్ద బారులు తీరారు. తదుపరి విడుదల తేదీ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్