విశిష్ట వ్యక్తుల కలయిక కార్యక్రమంలో భాగంగా, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి శనివారం తిరుమల విద్యా సంస్థల చైర్మన్ నున్న తిరుమలరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల పాలనలో సాధించిన విజయాలు, దేశ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే ఇతర ప్రముఖులను కూడా కలిసి దేశం సాధించిన ప్రగతిని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తామని తెలిపారు.