ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో, ముఖ్యంగా గత రెండేళ్ల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజమండ్రి పార్లమెంట్‌కు గణనీయమైన అభివృద్ధి ఫలాలు దక్కాయని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. శుక్రవారం రాజమండ్రిలోని తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంతో కలిసి జిల్లాలో తాగునీరు, రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, క్రీడలు, వైద్యం, విద్య వంటి రంగాలలో వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను చేపట్టిందని పేర్కొన్నారు.