రాజమండ్రిలోని విజయ శంకర ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాల ప్రిన్సిపాల్ గా పసుమర్తి శ్రీనివాస శర్మ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ప్రిన్సిపల్ గా పనిచేసిన కుమారి మండపాక నాగలక్ష్మి పదోన్నతి పై విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలకు బదిలీ అవడంతో శ్రీనివాస్ శర్మ ప్రిన్సిపల్ పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.