రాజమండ్రి: ఈనెల 18న ఆషాడ అష్టదేవతల ఆలయాలకు ఆర్టీసీ బస్సులు

ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని ఈనెల 18న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అష్టదేవతాల ఆలయాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు రాజమండ్రి డిపో మేనేజర్ మాధవ్ శనివారం తెలిపారు. ఉదయం 5 గంటలకు బయలుదేరి కడియపు లంక, చింతలూరు, మట్లపాలెం, కొవ్వూరు, పిఠాపురం, తాటిపర్తి, పెద్దాపురం, కాండ్రకోట ఆలయాలను సందర్శించి రాత్రి 8కి తిరిగి డిపోకు చేరుకుంటుందని తెలిపారు. టికెట్లకు 9502300189, 7382912141 నెంబర్లను సంప్రదించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్