ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి రోజు రోజుకి పెరుగుతుంది. అధికారులు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ ప్రజలు తీసుకోవలసిన చర్యలఫై సూచనలిస్తున్నారు. బోట్లు, మోటారు బోట్లు, స్టేమర్లతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈత కొట్టరాదని హెచ్చరిస్తున్నారు. కానీ రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద ప్రమాదకరంగా యువకుల ఈత విన్యాసాలు మారాయి. పిల్లలు, పెద్దలు గోదావరి నది ఒడ్డున ఈత కొడుతున్నారు.