సంత్ రవిదాస్ జయంతి: కులతత్వానికి వ్యతిరేకంగా బీజేపీ పిలుపు

రాజమండ్రిలో ఆదివారం, ఫిబ్రవరి 1, 2026న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర మాట్లాడుతూ, కులతత్వపు అడ్డుగోడలకు వ్యతిరేకంగా, అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం పరితపించిన మహనీయుడు రవిదాస్ అని, ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి ఓబిసి మోర్చా నాయకులు గోపి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కాలేపు సాయి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్