వైసీపీ పార్టీ కమిటీల పునర్నిర్మాణంలో ప్రతీ కమిటీ కీలకమని, పార్టీ బలోపేతానికి గ్రామ కమిటీలు ముఖ్యమని వైసీపీ మాజీ ఎమ్మెల్యే, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి సిటీలో అనుబంధ విభాగ అధ్యక్షులతో సమావేశమైన ఆయన, కమిటీల నిర్మాణంలో కీలక పాత్ర తీసుకోవాలని సూచించారు. అతి త్వరలో అన్ని అనుబంధ విభాగాలకు, గ్రామ అధ్యక్షులు, గ్రామ కమిటీల ఎన్నిక పూర్తి చేయాలని ఆదేశించారు.