రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, ఫిబ్రవరి 2వ తేదీన జిల్లా స్థాయిలో PGRS కార్యక్రమంతో పాటు రెవెన్యూ క్లినిక్స్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి ఆదివారం తెలిపారు. భూమి సమస్యల పరిష్కారానికి, భూమి సంబంధిత ఫిర్యాదులను వేగంగా పరిష్కరించడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసినట్లు ఆమె వెల్లడించారు. ప్రజలు Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా కూడా తమ అర్జీలను సమర్పించవచ్చని కలెక్టర్ సూచించారు.