డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, శుక్రవారం రాజమండ్రిలోని గోకవరం బస్టాండ్ వద్ద ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడానికి ప్రత్యేక ఎయిడ్స్ అవగాహన ప్రదర్శన ఏర్పాటు చేశారు. జిల్లా లేప్రసి & టిబి ఆఫీసర్ డా. ఎన్ వసుంధర తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమంలో HIV/AIDS సంక్రమణ మార్గాలు, నివారణ చర్యలు, పరీక్షల ప్రాముఖ్యతపై ప్రజలకు వివరించారు. ప్రజలు ఆరోగ్యంపై సావధానంగా ఉండాలని సూచించారు.