తూర్పు గోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీలో సిద్ధాని వెంకట్ కు ఓబీసీ జిల్లా ఉపాధ్యక్ష పదవి దక్కింది. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా బిజెపి అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకంపై కోరుకొండ స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు వెంకట్ పై ఉండాలని ఓబీసీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పచారి నరసింహమూర్తి ఆకాంక్షించారు. సిద్ధాని వెంకట్ తూర్పు గోదావరి జిల్లా వాసిగా బిజెపి పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్నారు.