సీతానగరం మండలం చినకొండేపూడి గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. సీనియర్ నాయకుడు కాండ్రు శేఖర్ పార్టీ జెండాను ఆవిష్కరించి, ఎన్టీఆర్ ఆశయాలను స్మరించుకున్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలందరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 'జై తెలుగుదేశం' నినాదాలతో గ్రామం మారుమోగింది.