రాజమండ్రి; హోంగార్డుల నిస్వార్థ సేవలకు ఎస్పీ ప్రశంసలు

తూర్పు గోదావరి, రాజమండ్రి సిటీలో, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హోంగార్డుల నిస్వార్థ సేవలను ప్రశంసించారు. అత్యవసర పరిస్థితుల్లో సేవా దృక్పథంతో విధులు నిర్వహిస్తున్నారని, పోలీస్ శాఖలో వారి సేవలు కీలకమని అన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన బి.ఎస్.ఎస్ ఉపేంద్ర, పవన్, పి. వెంకటరమణ, వి.జి. చౌదరి, జి.ఎస్.ఎస్. ప్రకాష్, జి. ప్రవీణ్ కుమార్, సిహెచ్.వి. సుబ్రహ్మణ్యంలకు ఎస్పీ ప్రశంసా పత్రాలు, మెమెంటోలు శనివారం అందజేశారు. క్రమశిక్షణతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్