రాజమండ్రి నుంచి కాశీ-అయోధ్యకు సూపర్ లగ్జరీ బస్సు యాత్ర ప్రారంభం

తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి నుంచి కాశీ, అయోధ్య పుణ్యక్షేత్రాల సందర్శన కోసం గురువారం  నుండి సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ప్రారంభిస్తున్నట్లు డిపో మేనేజర్ మాధవ్  తెలిపారు. 11 రోజుల పాటు సాగే ఈ యాత్రలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, అయోధ్య, బుద్ధగయ, అరసవెల్లి, శ్రీ కుర్మం, అన్నవరం సహా 13 ఆలయాలను సందర్శించవచ్చు. టికెట్ ధర రూ.13,000గా నిర్ణయించారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్