టీడీపీ తెలుగువారి ఆత్మగౌరవం నుంచి పుట్టింది: MLA ఆదిరెడ్డి

తెలుగు వారి ఆత్మగౌరవం నుంచే టీడీపీ పుట్టిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం రాజమండ్రి నగర టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ 44వ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పార్టీ నాయకులతో కలిసి జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎన్టీఆర్ పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్