కోరుకొండ మండలం కోటికేశవరంలో బుధవారం అర్ధరాత్రి జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో మద్యం మత్తులో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇటుకలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.