ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వైద్యారోగ్య శాఖలో ముగ్గురు కంటిన్యూ వర్కర్లు 2020 నుంచి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి నెలకు రూ.16 వేల వేతనం రావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. ఇటీవల కాకినాడ డీఎంహెచ్వో వారికి నెలకు రూ.5 వేలు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కొక్కరికి రూ.10 లక్షలు రావాల్సి ఉండగా, ఈ స్వల్ప మొత్తంతో ఎలా జీవించాలోనని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.