గ్రామ దేవతల ఉత్సవాల పేరుతో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోరుకొండ సీఐ ఎస్వీఎస్ మూర్తి బుధవారం హెచ్చరించారు. గోకవరం మండలం తంటికొండలో ఈ నెల 19న కుంతీదేవి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు నిర్వహించిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. సంస్కృతిని కలుషితం చేసే ఇలాంటి పనులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, నిరంతరం నిఘా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.