రాజమండ్రి పరిసరాల్లో ఫిబ్రవరి 1 నుంచి 4వ తేదీ వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మరణించారు. ఆదివారం దివాన్‌చెరువు వద్ద వైద్య విద్యార్థిని లిఖిత, సోమవారం రోడ్-కం-రైల్ బ్రిడ్జిపై బైకులు ఢీకొని ముగ్గురు, బుధవారం గామన్ బ్రిడ్జిపై లారీ కిందపడి ఇద్దరు మరణించారు. ప్రయాణ సమయంలో సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు.