రాజమండ్రిలో కలకలం.. డ్రైనేజీలో ఉద్యోగి మృతదేహం

రాజమండ్రి త్రీటౌన్ పరిధిలో ఓ ప్రైవేట్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. నూజివీడుకు చెందిన టి.చెన్నారావు అనే వ్యక్తి పురుగుమందుల కంపెనీలో ఏఎస్ఎంగా పనిచేస్తున్నారు. పని నిమిత్తం నగరానికి వచ్చి ఓ లాడ్జిలో బస చేసిన ఆయన మృతదేహం బుధవారం ఉదయం లాడ్జి సమీపంలోని మురుగు కాలువలో లభ్యమైంది. దీనిని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సుభాని తెలిపారు.

సంబంధిత పోస్ట్