రాజమండ్రిలో ఫిబ్రవరి 1, 2026 (ఆదివారం) న శ్రీ వివేకానంద మహోత్సవాల స్వర్ణోత్సవ ఆహ్వాన సభను ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. రాజమహేంద్రవరం నగరంలోని ఆనం రోటరీ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కార్యక్రమ వివరాలను వెల్లడించారు. రాష్ట్ర స్థాయి నేతలు, సంఘ సేవకులు, ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ స్వర్ణోత్సవ వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.