రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “పశు సంపదతో గ్రామ సంపద పెంపు” కార్యక్రమాన్ని పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని ఛాంబర్‌లో ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ రూపొందించిన “విలేజ్ హెర్డ్ ఫెర్టిలిటీ రిజిస్టర్” పుస్తకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. పశువుల సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడం, పాల ఉత్పత్తిని వృద్ధి చేయడం, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ముఖ్య ఉద్దేశ్యం.