రాజమండ్రిలో గురువారం జరిగిన బీఎల్‌ఏల అవగాహన సదస్సులో మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ, 'సర్' ప్రక్రియ నేపథ్యంలో వైసీపీ తరపున బూత్ లెవెల్ ఏజెంట్లు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను సరిచూసుకోవాలని సూచించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ఓటర్ల జాబితాలో తమ సానుభూతిపరుల ఓట్లు సక్రమంగా ఉండేలా చూడాలని ఆయన తెలిపారు.