తూ. గో జిల్లాలో నవంబర్ నెల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 2,35,060 మంది లబ్ధిదారులకు పెన్షన్లు మంజూరు కాగా, తొలి రోజునాటికి 2,20,948 మందికి పంపిణీ పూర్తయింది. శనివారం రాత్రి 8 గంటలకు పంపిణీ 94%గా నమోదైంది. రూ. 103.27 కోట్ల మొత్తాన్ని విడుదల చేయగా, అందులో రూ. 96.69 కోట్లు లబ్ధిదారులకు చెల్లించబడ్డాయి.