క‌డియం స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యంలో ఏబీసీ అధికారుల త‌నిఖీ

కడియంలోని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సబ్‌రిజిస్ట్రార్ ఎప్పిలి లక్ష్మి వద్ద రూ. 79,000 నగదు లభించినట్లు ఏసీబీ డీఎస్పీ కిశోర్ కుమార్ తెలిపారు. కార్యాలయంలో మొత్తం రూ. 1,82,000 నగదు, సొత్తు దొరికిందని ఆయన వెల్లడించారు. ఎస్‌ఆర్‌వో, సిబ్బంది లంచాలు వసూలు చేస్తున్నారనే సమాచారం మేరకు ఈ దాడులు జరిగాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్