రాజమండ్రిలో కల్తీ పాలు సరఫరా చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న గణేష్ తమ సంఘ సభ్యుడు కాదని రాజమండ్రి పాలు, పెరుగు వర్తకుల సంఘం అధ్యక్షుడు సూరంపూడి పనసయ్య స్పష్టం చేశారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ, గణేష్ తమ సంఘానికి చెందినవాడని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు అసత్యమని తెలిపారు. కల్తీ పాలు ఘటనపై ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.