సీతానగరం మండలం కూనవరంలో పూడ్చిపెట్టిన 8 నెలల గర్భవతి దుర్గ భవాని మృతదేహానికి శనివారం రీపోస్టుమార్టం నిర్వహించారు. రెండు నెలల క్రితం మృతి చెందిన ఆమె కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఇటీవల భర్తతో గొడవ పడినట్లు ఆడియో కాల్స్ బయటపడటంతో, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీతానగరం ఎస్ఐ శ్రీనివాస్ నాయక్ తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.