రాష్ట్రంలో ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి స్వంత గృహం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ ప్రియా సౌజన్య తెలిపారు. గురువారం రాజమండ్రి కలెక్టరేట్‌లో గృహ నిర్మాణ సంస్థ పనితీరుపై ఆమె సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ (2.0) పథకం ద్వారా గృహనిర్మాణాన్ని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆమె పేర్కొన్నారు.