రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శనివారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించి పాలన సాగిస్తుందని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం వల్లనే ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోయి, అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు తన పాలనా దక్షతతో గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టి, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు.