గురువారం సాయంత్రం మొంథా తుఫాను ప్రభావిత రాజమండ్రి రూరల్ మండలం రాజవోలు, కడియం మండలం ఆవ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సందర్శించారు. తుఫాను వల్ల నీట మునిగిన వరి పొలాలు, ఒరిగిన పంటలను ఆమె పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేయడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపబడుతుందని కలెక్టర్ తెలిపారు.