ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ జనవరి 3న తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. శుక్రవారం జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారులు ఈ విషయాన్ని తెలిపారు. ఉదయం 8.30 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు రాజమండ్రి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రిలో 'మహిళా విద్యావేత్తల సాధికారత – వృత్తి & వ్యక్తిగత సమతుల్యత' కార్యక్రమంలో పాల్గొంటారు.