జేగురుపాడులో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్

కడియం ఇన్స్పెక్టర్ ఏ. వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో శనివారం జేగురుపాడు గ్రామం పాముల మెట్ట కాలనీలో కార్డెన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులు గ్రామంలోని పలు ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టగా రికార్డులు లేని 12 మోటార్ సైకిల్స్ ను గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్న ఒక బెల్ట్ షాపును గుర్తించి 35 క్వార్టర్ డీపీఎల్ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్