ధవళేశ్వరం: ఎరుపెక్కిన గోదావరి జలాలు

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల గోదావరికి కొత్త నీరు వచ్చి చేరింది. గత నాలుగు, ఐదు రోజులుగా నీలి రంగులో ఉన్న గోదావరి నీరు ఆదివారం ఎరుపు రంగులోకి మారింది. ధవళేశ్వరం ఆనకట్ట నుంచి దిగువకు 2.48 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. నవంబర్ నెలలో గోదావరికి ఇంత మొత్తంలో వరద నీరు రావడం అరుదైన సంఘటన అని అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్