గోదావరి జిల్లాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి

గోదావరి జిల్లాలైన రాజమండ్రి, కాకినాడ, ఏలూరు నగరాలలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి శుక్రవారం అసెంబ్లీలో తెలిపారు. కొన్నేళ్ల కిందట నిర్మించిన గోదావరి బండ్ డ్రైన్, ఆవా చానల్ ప్రస్తుతం ఉపయోగంలో లేవని ఆయన పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు ముందే డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని సంబంధిత మంత్రులను ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్