తూ. గో జిల్లాలో వేగవంతంగా పింఛన్ల పంపిణీ

తూర్పు గోదావరి జిల్లాలో డిసెంబర్ నెల పెన్షన్ల పంపిణీ వేగంగా కొనసాగుతోందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు గాను, సోమవారం రాత్రి వరకు 2,20,181 మందికి పెన్షన్లు అందాయని, దీంతో పంపిణీ శాతం 93.89% కి చేరిందని పేర్కొన్నారు. ఆర్థికంగా కూడా 93.60% పురోగతి సాధించామని, రూ.102,70,42,500 పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.96,12,91,500 పంపిణీ చేసినట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్