దొంగతనం కేసులో బెయిల్‌పై విడుదలై, కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఎండ్రగుత్తి రామరాజు అనే పాత నేరస్తుడిని ఎస్సై మనోహర్ అరెస్ట్ చేశారు. లక్కవరం గ్రామానికి చెందిన ఇతనిపై కొవ్వూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పోలీసులు నిందితుడిని పట్టుకుని కోర్టులో గురువారం హాజరుపరిచారు. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు హెచ్చరించారు.