మొంథా తుఫాన్ కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాల వైసీపీ పరిశీలకులు గిరజాల వీర్రాజు పేర్కొన్నారు. మంగళవారం ఆయన కడియం ఆవలో నేలవాలిన వరి పంట పొలాలను పరిశీలించారు. వాతావరణ పరిశోధనా సంస్థ ఏడాది నుంచి తుఫాన్ల గురించి హెచ్చరిస్తున్నా, ప్రభుత్వం రైతుల మాటలను పట్టించుకోకుండా భీమా చెల్లించలేదని ఆయన ఆరోపించారు.