మహిళలపై అనుచిత వ్యాఖ్యలు: ABN రాధాకృష్ణపై వైసీపీ నేత ఫిర్యాదు

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ABN రాధాకృష్ణ వైఖరిని ఖండిస్తూ, వైసీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ గురువారం (ఏప్రిల్ 9, 2026) దవలేశ్వరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణ జర్నలిజం విలువలు పాటించకుండా మహిళలపై అసభ్యంగా మాట్లాడితే ప్రభుత్వ పెద్దలు మద్దతు పలుకుతున్నారని ఆమె ఆరోపించారు. రాధాకృష్ణ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసిన ఆమె, పోలీసులు రాధాకృష్ణను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్