వికాస ఆధ్వర్యంలో మే 2న జాబ్ మేళా

రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో మే 2వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంబీఏ ఉత్తీర్ణులైన 35 సంవత్సరాల లోపు అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్