కడియం: క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలి

కడియం మండలం మురముండ గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం సాయంత్రం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాధవ రాయుడుపాలెం గ్రామ సర్పంచ్ అన్నదేవుల వీర వెంకట సత్యనారాయణ చంటి పాల్గొని, క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్